Namaste NRI

బాటా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా  సంక్రాంతి సంబరాలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. అమెరికాలో సైతం అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా ఆహ్లాదకర వాతావరణంలో అంగరంగ వైభవంగా ఈ సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా వంటల పోటీలు, రంగవల్లి ముగ్గుల పోటీలు, పాటల పోటీలు, బొమ్మల కొలువు, మెలోడీ పాటల పల్లకి వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. సంగీత కచేరీ, క్లాసికల్ డాన్స్ బ్యాలెట్, జానపద నృత్యాలు, వేదికపై గేమ్ షో, డ్యాన్స్లు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా వండిన 36 రకాల రుచికరమైన వంటకాలతో కూడిన విందు భోజనాన్ని ఆహూతులు ఆరగించారు.

ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఆడిటోరియం మొత్తం సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించేలా తెలుగు లోగిళ్లను తలపించేలా ఆడిటోరియాన్ని అద్భుతంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరై అతిథులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. డిప్యూటీ కాన్సుల్ జనరల్ రాకేష్ అడ్లఖాతో పాటు 25 మంది అధికారులు కూడా హాజరయ్యారు.  కాంగ్రెస్ మ్యాన్ శామ్ లికార్డో ఆఫీస్ రెప్రజెంటేటివ్గా కాంగ్రెస్ మ్యాన్రో ఖన్నా హాజరు కాగా,  అసెంబ్లీ మెంబర్స్ యాష్ కల్రా, అలెక్స్ లీ, సూపర్ వైజర్లు ఒట్టో లీ, ఎలీసా మార్క్ వెజ్.. మేయర్లు రాజ్ సాల్వన్, కార్మెన్ మోంటానో, ల్యారీ కైలెన్, మైక్ హానోన్, సెర్గియో లోపెజ్, లియాంగ్ చావో కౌన్సిల్ మెంబర్లు మురళీ శ్రీనివాసన్, డెస్రీ క్యాంప్ బెల్, కేథీ కింబర్లిన్, యాజింగ్ ఝాంగ్, ఎల్వెలిన్ ఛౌ, యాంగ్ షావో, రేమండ్ లియూ, రాజ్ చహల్, శ్రీధర్ వెరోస్, విలియం లాం..స్కూల్ బోర్డ్ మెంబర్స్ అను నక్కా, రీనూ నాయర్ లతో పాటు పలువురు అధికారులు ఈ ఈవెంట్ కు  హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి , ఎన్నికైన అధికారులందరూ సభికులనుద్దేశించి మాట్లాడారు. వారికి సంక్రాంతి, భారత 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏఐఏ,  బాటా టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండియా కమ్యూనిటీ సెంటర్ (ఐసీసీ) కో ఫౌండర్ తలత్ హసన్, సీఈవో మనోజ్ గోయల్, మిగతా ఐసీసీ సభ్యులకు ఏఐఏ బృందం ధన్యవాదాలు తెలిపింది. చిన్న పిల్లలు చేసిన డ్యాన్స్, పాడిన దేశభక్తి గీతాలు, పాటల పల్లకి తదితర ప్రత్యేక కార్యక్రమాలను ఆస్వాదించారు. తానా, బాటా ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించడానికి, బోధించడానికి ఏర్పాటు చేసిన తెలుగు పాఠశాల విద్యార్థులు చేసిన స్కిట్, అనేక ఇతర కార్యక్రమాలు అలరించాయి. పెద్దలకు రంగవల్లి పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఏఐఏ ఐడల్ (పాటల పోటీ) కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈస్ట్ బే కరోకే (ఈబీకే) అండ్ బాటా/ఏఐఏ కరోకే బృందాలు సంయుక్తంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

శాన్ జోస్, కుపెర్టినో, ఫ్రీమాంట్, శాన్ రామోన్ మొదలైన ప్రదేశాలలో చిన్న పిల్లలకు డ్యాన్స్ లో శిక్షణను ఇచ్చేందుకు బాటా టీమ్ సభ్యులు కష్టపడి పనిచేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కు  పలు వ్యాపార సంస్థలు, పలువురు వ్యాపారవేత్తల నుంచి భారీ మద్దతు, స్పాన్సర్ షిప్ లభించింది. పవర్డ్ బై స్పాన్సర్ రియల్టర్ నాగరాజ్ అన్నయ్యగోల్డ్ స్పాన్సర్ శ్రీని గోలీ రియల్ ఎస్టేట్స్ ఇతర స్పాన్సర్లు రియల్టర్ శిఖా కపూర్, ఇన్ స్టా సర్వీస్, పీఎన్ జీ జ్యూవెలర్స్, ఎమ్సీఎస్ మాస్టర్ క్లాస్ అండ్ మహాకాల్ టెంపుల్వాలంటీర్లు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బాటా అధ్యక్షుడు కొండల్ కొమరగిరి ధన్యవాదాలు తెలిపారు.

శివ కడా, వరుణ్ ముక్క, హరి సన్నిధిలతో కూడిన బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి , సుమంత్ పుసులూరితో కూడిన స్టీరింగ్ కమిటీ శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన సాంస్కృతిక కమిటీ,  సందీప్ కేదార్ శెట్టి, సురేష్ శివపురం, రవి పోచిరాజులతో కూడిన లాజిస్టిక్స్ టీమ్, సంకేత్, ఉదయ్, ఆది, గౌతమి, సింధూరలతో కూడిన యూత్ కమిటీ, కల్యాణి, కృష్ణప్రియ, దీప్తి, స్రవంతిలతో కూడిన ఆర్ట్ అండ్ డిజైన్ కమిటీలను కొండల్ కొమరగిరి సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాటా  బృందానికి బాటా సలహా మండలి సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి అభినందనలు తెలిపారు.

 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events