Namaste NRI

సంతోష్‌శోభన్‌, అలేఖ్య జంటగా..కొత్త సినిమా షురూ

సంతోష్‌శోభన్‌, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుమత్‌ పాతూరి దర్శకుడు.  అమృత ప్రొడక్షన్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ పతాకాలపై సాయిరాజేష్‌, ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో నాగచైతన్య క్లాప్‌నివ్వగా, దర్శకుడు చందు మొండేటి కెమెరా స్విఛాన్‌ చేశారు. సాయిరాజేష్‌ మాట్లాడుతూ నేను, ఎస్‌.కె.ఎన్‌ కలిసి ఆరు ప్రేమకథా చిత్రాలు చేయాలనుకున్నాం. ఇప్పటికే కలర్‌ఫొటో, బేబీ వచ్చాయి. ప్రస్తుతం ఆనంద్‌ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాం. మరో రెండు లవ్‌స్టోరీస్‌ చేస్తాం. గత రెండు చిత్రాల తరహాలోనే విభిన్నమైన ప్రేమకథ ఇది. అన్ని విభాగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఈ కథకు సంతోష్‌శోభన్‌ చక్కగా కుదిరాడు అన్నారు.

సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ  బేబీ  వంటి సూపర్‌హిట్‌ను అందించిన టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు. కథానాయికగా నటించాలన్నది తన కల ఈ సినిమాతో నెరవేరిందని అలేఖ్య పేర్కొంది. ఈ కథ విన్నప్పుడే హిట్‌ పక్కా అనే భావన కలిగిందని నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ పేర్కొన్నారు.  ఈ చిత్రానికి కెమెరా: అస్కర్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కథ: సాయిరాజేష్‌, సహనిర్మాతలు: ధీరజ్‌ మొగిలినేని, రమేష్‌ పెద్దింటి, దర్శకత్వం: సుమన్‌ పాతూరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events