Namaste NRI

హ‌రిహర వీర‌మ‌ల్లు నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పిరియడికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ను పంచుకుంది.ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో అనే రెండో సింగిల్ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా వాలంటైన్స్డేను పురస్కరించుకొని కొత్త పోస్టర్ను పంచుకుంది. జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events