మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపికలో బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేసులో ఉన్న సీనియర్ నాయకులు అందరినీ పక్కన పెట్టి, అసలు రేసులోనే లేని మోహన్‌యాదవ్‌కు సీఎం పదవి కట్టబెట్టింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై తమ నాయకుడిగా మోహన్ యాదవ్‌ను ఎన్నుకున్నది. దాంతో గత 8 రోజుల మధ్యప్రదేశ్ సీఎం ఎంపికపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక కోసం అంతకుముందు బీజేపీ హైకమాండ్ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఆశా లక్రాలతో కేంద్ర పరిశీలకులుగా నియమించింది. ఈ పరిశీల సమక్షంలోనే కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా మోహన్‌యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.