Namaste NRI

రిలీజ్‌కు సిద్ధమైన తండేల్‌‌లో శివశక్తి సాంగ్‌.. ఎప్పుడంటే?

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్‌.  శ్రీకాకుళం మత్య్యకారుల జీవితంలో జరిగిన యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాలరుల జీవన పోరాటం, దేశభక్తి ప్రధానాంశాలుగా దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని బుజ్జి తల్లి అనే గీతం మ్యూజిక్‌ ఛార్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రెండో గీతం శివశక్తి ని ఈ నెల 22న వారణాసి ఘాట్స్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, శ్రీముఖ లింగం శివాలయ విశిష్టతను తెలియజెప్పే ఈ పాట విజువల్‌గా అద్భుతంగా ఉంటుందని, జాతర నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభతో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన ఈ గీతానికి శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ఫిబ్రవరి 7న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, సమర్పణ: అల్లు అరవింద్‌, నిర్మాత: బన్నీ వాసు, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress