శ్రీకాకుళం జిల్లా డి.మత్యలేశం గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ప్రతిష్టా త్మక చిత్రం తండేల్. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీకి చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాకుళంలో దక్షిణకాశీగా పేరు గాంచిన శైవక్షేత్రం శ్రీముఖలింగం. అక్కడ వైభవంగా జరిగే శివరాత్రి మహోత్సవాలను స్పూర్తిగా తీసుకొని అద్భుతమైన శివరాత్రి పాటను ఈ సినిమా కోసం చిత్రీకరించారు. దేవిశ్రీప్రసాద్ టైమ్‌లెస్ క్లాసిక్‌గా ఈ పాటను కంపోజ్ చేశారని, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో వేలాదిమంది డ్యాన్సర్స్‌తో కలిసి నాగ చైతన్య, సాయిపల్లవి ఈ పాటకోసం చేసిన డ్యాన్స్ కొన్నేళ్లపాటు గుర్తుండిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ సాంగ్ షూట్ నుంచి రెండు పోస్టర్లను మేకర్స్ విడుదల చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి సంప్రదాయ దుస్తులతో ఈ పోస్టర్లో కనిపించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్, సమర్పణ: అల్లు అరవింద్.