అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు షాక్ తగిలింది. వర్జీనియా రాష్ట్ర గవర్నర్‌గా రిపబ్లికన్ నేతగా గ్లెన్ యంగ్‌కిన్ ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ నేత బైడెన్ పాలనలో వర్జీనియా గవర్నర్‌గా రిపబ్లికన్ ఎన్నిక కావడం మేజర్ అప్ సెట్ అని అమెరికా మీడియా భావిస్తోంది. డెమోక్రటిక్ అభ్యర్థి టెర్నీ మెక్ఔలిఫ్పై యంగ్‌కిన్ గెలుపొందారు. 2014 నుంచి 18 మెక్ఔలిఫ్ వర్జీనియా గవర్నర్‌గా చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ పాలన తీరుకు ఈ ఎన్నికలు రిఫరిండంగా నిలుస్తాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది.
నిజాగానికి గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వర్జీనియా నుంచి జో బైడెన్ పది పాయింట్లతో గెలిచారు. యంగ్‌కిన్ వర్జీనియాకు చెందిన వ్యాపారవేత్త, విద్య అంశాన్ని ఆయన ఈ ఎన్నికల్లో ప్రధానంగా లేవనెత్తారు. డెమోక్రటిక్ నేత టెర్రీపై గ్లెన్ గెలవడానికి ఇదే ప్రధాన సూత్రమైంది.