Namaste NRI

శ్వాగ్ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా : శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం శ్వాగ్‌. హసిత్‌ గోలి దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడు తూ వంశాలు, తరాల నేపథ్యంలో జరిగే పెద్ద కథ ఇది. దీనిని తెరపై తీసుకురావడం అంత సులభం కాదు. ఇప్పటివరకు ఏ సినిమాలో నేను డబుల్‌ యాక్షన్‌ చేయలేదు. అలాంటిది ఇందులో నాలుగు పాత్రల్ని పోషించాను అన్నారు.  ఈ సినిమా కథలో కామెడీతో పాటు హృదయాల్ని కదిలించే ఎమోషన్స్‌ ఉంటాయి. చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది. కుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా సినిమాను తీర్చిదిద్దాం అన్నారు.

ఈ సినిమాలో శ్రీవిష్ణు పోషించిన నాలుగు పాత్రలు వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తాయని, కమల్‌హాసన్‌ తరహాలో నాలుగు పాత్రల్ని ధైర్యంగా చేశారని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. దర్శకుడు హసిత్‌ గోలి మాట్లాడు తూ శ్రీవిష్ణు నాలుగు పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచాడు. వివేక్‌సాగర్‌ మ్యూజిక్‌ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఇంటర్వెల్‌, ైక్లెమాక్స్‌ ఘట్టాలు ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతాయి అన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన మహారాణి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని కథానాయిక రీతూవర్మ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సినిమా  ఈ నెల 4న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events