
సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తెలుసు కదా. నీరజా కోన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మిస్తున్నారు. హోలీ సందర్భంగా కలర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాయకానాయికలు సిద్ధు, రాశీఖన్నా, శ్రీనిధి పండగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగుతుంది. హృదయాన్ని స్పృశించే సున్నితమైన భావోద్వేగాలతో మెప్పిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: నీరజా కోన.
