ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుం టుందని, తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యా రని, వారికి సహాయం చేసేందుకు టాలీవుడ్ కలిసికట్టుగా ముందుకెళ్తుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదరప్రసాద్ మాట్లాడుతూ ఫిల్మ్ ఛాంబర్ తరపున రెండు రాష్ర్టాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు 25 లక్షల చొప్పున 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తు న్నాం. ఫిల్మ్ ఫ్రొడ్యూసర్స్ తరపున ఉభయ రాష్ర్టాలకు చెరో పది లక్షలు అందజేస్తాం అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-27.jpg)
తమ కుటుంబం నుంచి రెండు రాష్ర్టాలకు కలిపి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నామని నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు తెలిపారు. తమ నిర్మాణ సంస్థ నుంచి రెండు రాష్ర్టాలకు చెరో 25 లక్షలు ఇవ్వబోతు న్నట్లు నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. నేడు అన్ని యూనియన్లతో సమావేశం నిర్వహించి ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నామని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-25.jpg)
సెలబ్రిటీలు ఇచ్చిన విరాళాల వివరాలు..
– మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– మహేశ్‌బాబు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం
– త్రివిక్రమ్, సూర్యదేవర రాధాకృష్ణ, నాగవంశీ కలిసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 25 లక్షల చొప్పున విరాళం
– సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 15 లక్షల చొప్పున 30 విరాళం
– విశ్వక్‌సేన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం
– డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం
– అనన్య నాగళ్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల విరాళం
– వైజయంతీ మూవీస్ రూ.45 లక్షలు విరాళంగా ప్రకటించింది.
– ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20 లక్షలు ప్రకటించింది. స్టార్ యాక్టర్ రాంచరణ్ రూ.కోటి విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించాడు.