దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న చిత్రం జనక అయితే గనక. సుహాస్ కథానాయకుడిగా రూపొందుతో న్న ఈ కోర్టు డ్రామా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి సందీప్‌రెడ్డి బండ్ల దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.పలక పట్టుకుని దాన్ని ఓరగా చూస్తున్న సుహాస్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. అలాగే న్యాయదేవత బొమ్మ, చిన్న పిల్లల స్కూల్ బ్యాగ్, స్కూల్ బస్, టెడ్డీ బేర్ బొమ్మలను కూడా ఈ పోస్టర్‌లో గమనించవచ్చు. విభిన్నమైన కాన్సెప్టులను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకు న్న సుహాస్‌కి ఈ సినిమాతో మరో విజయం దక్కడం ఖాయమని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: విజయ్ బుల్గానిక్, సమర్పణ: శిరీష్.