తమిళ అగ్ర నటుడు సూర్య తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని కోరిక ఉన్న విషయం తెలిసిందే. మంచి కథ దొరికితే చేస్తానని చాలా సినిమా ఈవెంట్ లలో వెల్లడించాడు. దీంతో ఆయన త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో సూర్య పనిచేయబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే అవన్నీ కార్యరూపం దాల్చలేదు. కానీ సూర్య ఇప్పటి వరకు కేవలం ఒక్క స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ మాత్రమే చేశాడు. అది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర 2 (2010). దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఓ డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ కోసం సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజాగా సూర్య తెలుగు స్ట్రెయిట్ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టై నమెంట్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. జీవీ ప్రకాశ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. మరోవైపు సూర్య చందూ మొండేటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
