
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. త్రిష కథానాయిక. సూర్య 45వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతున్నది. ఆర్జే బాలాజీ పుట్టిన రోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తాజాగా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాకు కరుప్పు (నలుపు) అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అమ్మవారి నేపథ్యంలో కత్తి పట్టి ఫెరోషియస్ లుక్‌లో ఉన్న సూర్యను ఈ పోస్టర్‌లో చూడొచ్చు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వాసిక, అనఘ మాయ రవి, శివద, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాతలు: ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, నిర్మాణం: డ్రీమ్ వారియర్ పిక్చర్స్.
