కెనడాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో పని చేస్తున్న భారత సంతతి యువతి గుర్‌సిమ్రాన్ కౌర్ (19) మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాల్‌మార్ట్ స్టోర్ బేకరీ సెక్షన్‌లో గుర్‌సిమ్రాన్ కౌర్ ఈ నెల 19న అనుమా నాస్పద స్థితిలో మరణించింది. దీనిపై వాల్‌మార్ట్ మరో ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుర్ సిమ్రాన్ కౌర్ (19)ను పై నుంచి కింద తోసేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. హాలిఫాక్స్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో గుర్‌సిమ్రాన్ కౌర్ రెండేండ్లుగా పని చేస్తున్నది. ఇదే స్టోర్‌లో పని చేసిన ఆమె తల్లే హత్య చేసి ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఈ అనుమానాస్పద కేసు దర్యాప్తు కొనసాగుతుందని స్థానిక పోలీసులు చెప్పారు. ఆ యువతి హత్యకు కారణం గానీ, హత్య జరిగిన తీరుపై ఇంకా నిర్ధారణకు రాలేదని పోలీస్ వర్గాల కథనం. పలు దర్యాప్తు సంస్థలతో కలిసి విచారిస్తున్నాం. దర్యాప్తు సంక్లిష్టంగా ఉంది. దర్యాప్తు పూర్తి కావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది అని హాలిఫాక్స్ రీజనల్ పోలీసు కార్యాలయం తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)