Namaste NRI

తానా కార్యవర్గంలో పెనమలూరువాసి..తానా ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా ఠాగూర్‌ మల్లినేని

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా పేరు పొందిన ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 2023`25 కార్యవర్గంలో పెనమలూరుకు చెందిన ఠాగూర్‌ మల్లినేని ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా ఎన్నికయ్యారు. తానాలో మీడియా కో ఆర్డినేటర్‌గా పాపులర్‌ అయిన ఠాగూర్‌ మల్లినేని ఇటీవల జరిగిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా పెనమలూరులో చేయూత కార్యక్రమం కింద పేద విద్యార్థులకు దాదాపు లక్ష రూపాయల విలువ చేసే స్కాలర్‌ షిప్‌ లను, పేద రైతులకు పవర్‌ స్ప్రేయర్లు, రైతు రక్షణ పరికరాలను అందజేశారు. ఆదరణ కార్యక్రమం కింద మహిళలకు కుట్టుమిషన్లను, వికలాంగులకు ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. క్యాన్సర్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటుతోపాటు ఇఎన్‌టి, ఉచిత వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. జడ్‌పి హైస్కూల్‌కు కుట్టుమిషన్లను అందజేశారు.

 ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా ప్రపంచంలోని తెలుగు కమ్యూనిటీకి, తెలుగు సంఘాలకు తానా కార్యక్రమాలు తెలుసుకునేలా చేయడంతోపాటు, వారిని కూడా ఇందులో భాగస్వాములయ్యేలా కృషి చేయనున్నట్లు ఠాగూర్‌ మల్లినేని చెప్పారు. కాగా ఠాగూర్‌ మల్లినేనికి పదవి లభించడం పట్ల పెనమలూరువాసులు, ఆయన మిత్రులు పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News