గోవుల తరలింపుపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సరైన ధ్రువపత్రాలు లేకుండా గోవులను నగరంలోకి తరలించేందుకు అనుమతి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోలీసులతో పాటు గోరక్ష దళ్‌కు చెందిన ఒక వ్యక్తి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలను తనిఖీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయవచ్చని తెలిపింది. గోవుల తరలింపుపై పోలీసులకు గో రక్షకులు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. గోరక్షకుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై విచారించి కేసులు నమోదు చేయాలని తీర్పులో పేర్కొంది.