ఆంధ్రప్రదేశ్ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా దుబాయ్‌లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ వేడుకలు కొనసాగాయి. సూరపనేని రాజీష ఆధ్వర్యంలో జరిగా యి. మంత్రి వర్గంలో మహిళకు చోటు దక్కటంతో పాటు అతి ముఖ్యమైన హోమ్ శాఖ అనిత వంగల పూడికి కేటాయించడంతో దుబాయ్‌లో తెలుగు మహిళా విభాగం సభ్యులంతా ఒక చోట సమావేశమై కేకు కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

గత ఏడాది ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వంగలపూడి అనిత దుబాయ్ విచ్చేశారు. ఆ సమయంలో తమ అందరితో ఎంతో ఆప్యాయంగా గడిపారని గుర్తు చేసుకున్నారు. ఫైర్ బ్రాండ్‌గా పేరు పొందిన అనిత ఆ పదవిలో అద్భుతంగా రాణిస్తారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సౌమ్య, భార్గవి, శ్రావణి, అనూష, అమూల్య, సునీత, ప్రవీణ, బాల, జ్యోత్స్న పాల్గొన్నారు.
