
సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా రూపొందిన ప్రేమకథ ప్రణయ గోదారి. పి.ఎల్.విఘ్నేష్ దర్శకుడు. పారమళ్ల లింగయ్య నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. సినిమా చూసినవారంతా అభినందిస్తున్నారనీ, ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని దర్శకుడు విఘ్నేష్ చెప్పారు. తన పాత్రను అందరూ ప్రశంసిస్తున్నారని, ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్సని కథానాయిక ప్రియాంక ప్రసాద్ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
