Namaste NRI

ఆ జంట‌కు అమెరికా కోర్టు … వందేళ్ల జైలుశిక్ష

స్వ‌లింగ సంప‌ర్కుల జంట‌కు  అమెరికా కోర్టు వందేళ్ల జైలుశిక్ష వేసింది. పేరోల్ కూడా తీసుకునే ఛాన్స్ ఇవ్వ‌లేదు. ద‌త్త‌త తీసుకున్న కుమారుల‌ను,  లైంగికంగా వేధించిన కేసులో గే జంట‌కు వాల్ట‌న్ కౌంటీ జిల్లా అటార్నీ ఈ శిక్ష‌ను విధించారు. 34 ఏళ్ల విలియ‌మ్‌, 36 ఏళ్ల జాచ‌రి జులాక్ అనే ఇద్ద‌రికీ ఈ శిక్ష ప‌డింది. ఈ ఇద్ద‌రూ 12, 10 ఏళ్లు ఉన్న ఇద్ద‌రు సోద‌రుల్ని ద‌త్త‌త తీసుకున్నారు. అట్లాంటా శివారుల్లో ఉండే ఆ గే జంట‌,  హ్యాపీ ఫ్యామిలీ పేరుతో పిల్ల‌ల్ని పెంచేందుకు అంగీక‌రించారు. కానీ ఆ పిల్ల‌ల‌కు న‌ర‌కం చూపించిన‌ట్లు జిల్లా అటార్నీ రాండీ మెక్‌గిన్లే తెలిపారు. ద‌త్త‌త పిల్ల‌ల్ని రేప్ చేసిన‌ట్లు అటార్నీ త‌న తీర్పులో వెల్ల‌డించారు.

జాచ‌రి బ్యాంకింగ్ సెక్టార్‌లో ప‌నిచేస్తున్నాడు. ఇక విలియ‌మ్ ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి. వాళ్ల జీవితాల్లో బాగానే సెటిల్ అయ్యారు. కానీ రెగ్యుల‌ర్‌గా ద‌త్త‌త పిల్ల‌ల‌ను శృంగారంలోకి దింపేవార‌ట‌. ఇంకా వారితో జ‌రిగే సెక్స్‌ను వీడియోలు తీసేవారు. ఆ తీసిన చిత్రాల‌ను త‌మ స్నేహితుల‌తో ఆ జంట షేర్ చేసుకునేద‌ని కోర్టులో తేలింది. పోలీసుల‌కు దొరికిన సాక్ష్యాల ఆధారంగా దీన్ని క‌న్ఫ‌ర్మ్ చేశారు. విలియ‌మ్‌, జాచ‌రిల‌ను 2022లో అరెస్టు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events