దుల్కర్ సల్మాన్, దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్న తెలిసిందే. దుల్కర్ బర్త్ డే స్పెషల్‌గా గతంలో విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వస్తోంది.దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ప్రయాణం మొదలైంది. ఆకాశంలో ఒక తార పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దుల్కర్ సల్మాన్, పవన్ సాదినేని, అశ్వినీదత్, అల్లు అరవింద్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈవెంట్‌కు హాజరయ్యారు. త్వరలోనే ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ మొదలు కానుంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా డెబ్యూ ఇస్తోంది. సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్న ఈ మూవీ 2025లో విడుదల కానుండగా, విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్నట్టు సమాచారం. లైట్ బాక్స్, స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.