Namaste NRI

దారి మళ్లించిన TANA ఫౌండేషన్ నిధులను పూర్తిగా తిరిగిరాబడతాం – బోర్డు చైర్మన్

తానా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించిన మాజీ ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు నుంచి ప్రతి రూపాయి తిరిగి రాబట్టేందుకు తానా బోర్డ్ పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము.

తానాలో ఇంతకుముందు ఎప్పుడూ చోటు చేసుకోని ఈ ఘటనపై నవంబర్ 25న అత్యవసర బోర్డ్ సమావేశాన్ని నిర్వహించాము. ఈ సమావేశానికి శ్రీకాంత్ పోలవరపు హాజరై, తన తప్పిదాన్ని అంగీకరించడమే కాకుండా, పూర్తి బాధ్యత తానే వహిస్తానని స్పష్టంగా తెలిపారు. నిధుల మళ్లింపు చర్య తన వ్యక్తిగత నిర్ణయం మాత్రమే నని, దీని గురించి మరెవ్వరికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీకాంత్ తన ఫౌండేషన్ ట్రస్టీ పదవికి రాజీనామా సమర్పించగా, దానిని మేము ఆమోదించాము. ఇప్పటికే లక్ష డాలర్లు తిరిగి చెల్లించిన శ్రీకాంత్, మళ్లించిన మొత్తం $3.6 మిలియన్ డాలర్లు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

దారి మళ్లించిన నిధులను పూర్తిగా తిరిగి రాబట్టేందుకు తానా బోర్డ్ చట్టబద్ధంగా, న్యాయపరంగా, మరియు FBI సహాయంతో ముందుకు సాగుతున్నాము. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, కఠిన మార్గదర్శకాలతో సాంకేతిక మరియు పరిపాలనా చర్యలు అమలు చేస్తామని, తానా బోర్డు చైర్మన్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలియజేశారు.

ధన్యవాదములు ,

డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి

తానా బోర్డు చైర్మన్

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events