ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించినఈ చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నాయకుడు పేరుతో తెలుగులో గ్రాండ్ గా విడుదల చేశారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూనిక్ ఇంటెన్స్ కంటెంట్ తో అందరినీ అలరించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ విలేకరుల సమవేశంలో నాయకుడు విశేషాలని పంచుకున్నారు.నాయకుడు చిత్రం తమిళంలో మామన్నన్ పేరుతో విడుదలై గొప్ప విజయం సాధించింది. ఈ చిత్రంలో ఓ కామన్ ఎమోషన్ వుంది. ఆ ఎమోషన్ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ కావడం గొప్ప ఆనందాన్నిచ్చింది అన్నారు. మారి సెల్వరాజ్ గారి దర్శకత్వంలో పనిచేయాలని ప్రతి హీరోయిన్‌కు వుంటుంది. ఆయన కథలో హీరోయిన్ పాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. ఈ చిత్రంలో నాది సింపుల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. షూటింగ్‌కు గంట ముందు నాకు లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. ఈ చిత్ర కథ చెప్పినప్పుడు కూడా చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. ఆయన చెప్పిన దాని కంటే నాలుగు రెట్లు బెటర్‌గా సినిమా తీశారు. రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ. ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పనిచేయడం చాలా సరదాగా వుంటుంది’ అన్నారు.
