![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Mayfair-10.jpg)
శివకుమార్, నందినిరాయ్ జంటగా ఓ చిత్రం రూపొందనుంది. రవికుమార్ నాసు దర్శకుడు. ట్రెండ్‌సెట్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రారంభోత్సవం అమెరికా వర్జీనియాలోని సాయిబాబా టెంపుల్‌లో ఘనంగా జరిగింది. ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే చేస్తామని నిర్మాతలు తెలిపారు. థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతికనిపుణులు, షూటింగ్ వివరాలను త్వరలో తెలియజేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయికుమార్ అయినంపూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శ్రావణి ముదిరాజ్, మాధవి నాసు, లైన్ ప్రొడ్యూసర్: పద్మ వాయువేగుల, చైతన్యవర్మ.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Ixora-10.png)