అమెరికాలో తొలిసారిగా జింకకు కరోనా వైరస్ సోకింది. ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కొవిడ్`19 వైరస్ సోకిందని అమెరికా వ్యవసాయ శాఖ తెలిపింది. జింకకు కరోనా వైరస్ ఎలా సోకిందనేది ఇంకా తేలలేదని అమెరికా ప్రతినిధి లిండ్సే కోల్ తెలిపారు. మనుషుల ద్వారా, ఇతర జింకలు, మరొక జంతు జాతుల ద్వారా వైరస్ సోకి ఉంటుందని తాము అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒహియో స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ కొనసాగిస్తున్న అధ్యయనాలలో భాగంగా జింకకు కొవిడ్ 19 వైరస్ సోకినట్లు బయటపడిరది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 ఉన్న వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్న జంతువులకు కరోనా సోకిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.