అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వాషింగ్టన్‌లోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్సిటీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 78 ఏండ్ల క్లింటన్ తీవ్ర జ్వరంతో బాధతుండటంతో హాస్పిటల్‌లో చేర్పించినట్లు అయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. క్రిస్మస్ నాటికి తిరిగి ఇంటికి చేరుకుంటానని బిల్ క్లింటన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ రెండు సార్లు సేవలందించారు. 1993-2001 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత నుంచి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడం వల్ల ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ అయింది. 2005లో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో దవాఖానలో చేరారు. 2021 లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు ఆరు రోజుల పాటు కాలిఫోర్నియాలోని హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. 2022లో కరోనా బారినపడిన ఆయన కొన్నిరోజులకు కోలుకున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ల తరఫున ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.