భూగోళంపై జీవజాలం మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పుల పట్ల జి`20 దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు రోమ్‌లో జరిగిన సదస్సు ముగిసింది. ఐరాస ఆధ్వర్యంలో గ్లాస్గోలో మొదలైన వాతావరణ మార్పుల సదస్సుకు చర్చనీయాంశాన్ని దీనిలో ఖరారు చేసినట్లయింది.వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూమి వేడెక్కడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాల 2050 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలని తీర్మానించారు. కర్బన ఉద్గారాల తటస్ఠీకరణ కచ్చితంగా సాధించాలని నిర్ణయానికొచ్చారు. అంతేకాకుండా విదేశాల్లో బొగ్గు అధారిత (థర్మల్) విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు ఇకపై ఎలాంటి ఆర్థిక సాయం అందించరాదని ప్రతిన బూనారు. కోవిడ్ 19 మహమ్మారిపై పోరాటంలో వ్యాక్సిన్లే అతిపెద్ద ఆయుధాలని అంగీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీని పెంచడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
బొగ్గును మండిరచడం వల్ల ఎదురవుతున్న సమస్యల్ని నివారించాలంటే విదేశాల్లోని తాప విద్యుత్కేంద్రాలకు ప్రభుత్వాల తరపున నిధులు ఇవ్వడాన్ని నిలిపివేయాలని దేశాధినేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరి నుంచే ఇది అమల్లోకి రానుంది. బొగ్గు వినియోగాన్ని దేశీయంగా క్రమంగా తగ్గించుకునేందుకు మాత్రం ఎలాంటి లక్ష్యాఇ్న నిర్దేశించలేదు. ఈ మేరకు భారత్, చైనా వంటి దేశాలకు కొంత ఊరటనిచ్చే ఉమ్మడి ప్రకటన విడుదలైంది. గ్రీన్ హౌస్ వాయువుల్లో నాలుగింట మూడొంతులు ఒక్క జి`20 దేశాల నుంచే వెలువడుతున్నాయి. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడంలో పేద దేశాలకు సాయపడేందుకు ధనిక దేశాలు ఏటా 100 బిలియన్ డాలర్లు (సుమారు 7,50,000 కోట్లు) సమీకరించాలన్న మునపటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు కూటమి దేశాలు పునరుద్ఘాటించాయి.