అగ్రరాజ్యం అమెరికాలో శ్వేతజాతీయులు ఆసియన్లపై విపరీతంగా దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. స్టాప్ ఏఏపీఐ హేట్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… కరోనా విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి అమెరికా వ్యాప్తంగా 9వేల యాంటీ ఆసియన్ సంఘటనలు చోటు చేసుకున్నట్టు తెలిపింది. ఆసియన్లపై గత సంవత్సరం 4,548 భౌతిక దాడులు జరిగితే ఈ ఏడాది ఇప్పటి వరకు 4,533 దాడులు జరిగినట్టు వెల్లడిరచింది. గత సంవత్సరంతో పోల్చితే ఆసియన్లపై జరుగుతున్న దాడులు 6.6 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఆసియన్ అమెరికన్లపై జాతి వివక్ష దాడులు పెరుగుతున్న క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.