హీరో నాని సమర్పకుడిగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. షూటింగ్ పూర్తయింది. మార్చి 14న విడుదల కానుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అనుకోని పరిస్థితుల్లో దోషిగా ముద్రవేయబడిన వ్యక్తి కథ ఇది. న్యాయం, సత్యం కోసం అతని పోరాటాన్ని ఆవిష్కరిస్తుంది. న్యాయం కోసం అన్వేషణలో ఉత్పన్నమయ్యే కీలక ప్రశ్నలను చర్చిస్తుంది అని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాలో ప్రియదర్శి న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కోర్ట్‌రూమ్ డ్రామాగా ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తుందని, అంతర్లీనంగా సందేశంతో మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాణ సంస్థ: వాల్‌పోస్టర్ సినిమా, కథ, దర్శకత్వం: రామ్ జగదీష్.