ఉత్తర కొరియా విజయవంతంగా లాంగెస్ట్ బాలిస్టిక్ మిస్సైల్‌లో పరీక్షించింది. సుదూరంలో ఉన్న అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే రష్యాకు సహాయం అందించేందుకు దళాలను పంపిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న మరోసారి, మిస్సైల్‌ను పరీక్షించడంతో అమెరికా సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా ప్రయోగించిన మిస్సైల్‌ను ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా భావిస్తున్నామని అమెరికా తెలిపారు. ఉత్తర కొరియా పరీక్షించిన మిస్సైల్, ఎక్కువ ఎత్తు వరకు, ఎక్కువ సమయం ప్రయాణించిందని జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటానీ తెలిపారు. ఈ క్రమంలో ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణిని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా భావిస్తున్నామన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)