అగ్ర హీరో రవితేజ తమ్ముడి కుమారుడైన మాధవ్ హీరోగా పరిచయమౌతున్న చిత్రం మిస్టర్ ఇడియట్. సిమ్రాన్‌శర్మ కథానాయిక. గౌరి రోణంకి దర్శకత్వంలో జె.జె.ఆర్.రవిచంద్ర చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథులుగా వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ, బెక్కెం వేణుగోపాల్ యూనిట్‌కి శుభాకాంక్షలందించారు. యూత్ మెచ్చేలా సినిమా తీశామని, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని డైరెక్టర్ గౌరి తెలిపారు. నవంబర్‌లో సినిమాని రిలీజ్ చేస్తామని నిర్మాత చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లు మాట్లాడారు. త్వరలో సినిమా విడుదల కానుంది.