టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు అందరికీ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ పక్షాన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సతీశ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ లో ఎన్నిక ఏదైనా ప్రజలంతా ఎప్పుడు టీఆర్ఎస్ వైపే అన్నది ప్రజలు మరొక్కసారి నిరూపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అద్భుతమైన పాలనను చూసి ప్రజల మరోసారి ఆశీర్వదించారని, అందుకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగానే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఘనమైన విజయం సాధించారని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)