ఏడు పదుల వయస్సు ధాటినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఈ స్టార్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే.తాజాగా మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం టర్బో. షార్ట్ హెయిర్, కోరమీసాలతో ఉన్న మమ్ముట్టి బ్లాక్ షర్ట్, తెలుపు లుంగీలో ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. తాజా లుక్ చూసిన అభిమానులు తమ ఫేవరేట్ హీరో నుంచి చాలా కాలానికి పక్కా మాస్ ఎంటర్‌టైనర్ వస్తోందని ఆనందంలో ఫుల్ ఖుషీ అవుతున్నా రు.
