ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహిస్తున్న నవలల పోటీలోఈ ఏడాది ఇద్దరు విజేతలుగా నిలిచారు. తెలుగు నవలా సాహిత్యాన్ని మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పోటీలను తానా నిర్వహించింది. ఈ ఏడాది ఇద్దరు విజేతలుగా నిలిచారు. విశాఖపట్నానికి చెందిన చింతకింది శ్రీనివాసరావు (మున్నీటి గీతలు), అనంతపురానికి చెందిన బండి నారాయణ స్వామి (అర్ధనారి) గెలుపొందారు. కథా సాహితీ సహకారంతో నిర్వహించిన ఈ పోటీకి సుమారు 107 నవలలు వచ్చినట్టు తానా సభ్యులు తెలిపారు. ఒక్కో విజేతకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతిని తానా ప్రకటించింది. త్వరలో విజేతలకు ఈ బహుమతులు అందజేయనున్నట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, పోటీ కార్యనిర్వాహకులు జంపాల చౌదరి, ప్రచురణల కమిటీ అధ్యక్షుడు చంద్ర కన్నెగంటి తెలిపారు.