చైనా-తైవాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్‌కు 200 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా అంగీకరించింది. ఈ ఒప్పందాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. వీటిని తక్షణం నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది.
తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలి. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన చర్యలను వెంటనే ఆపాలి. చైనా తన జాతీయ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొన్నది.