నాని హీరోగా నటించిన చిత్రం హాయ్ నాన్న. మృణాళ్ ఠాకూర్ కథానాయిక. బేబీ కియారా కీలకభూమిక పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు శౌర్యువ్. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. నాని మాట్లాడుతూ నాని ఈ సినిమాలో ఏడిపిస్తాడు. ఇదో ఎమోషనల్ సినిమా అనుకుంటున్నారు కదా. కాదు. మీకళ్లల్లో నీళ్లు కూడా ఆనందంగా తిరుగుతాయి. ఆనందభాష్పాలు తెప్పించే సినిమా ఇది. సాంకేతికంగా అద్భుతంగా ఉంటుందీ సినిమా. ఈ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ గొప్ప స్థాయికి వెళతాడు అని అన్నారు. ఇంకా మృణాళ్‌ఠాకూర్, ప్రియదర్శి, బేబీ కియారా, నిర్మాత డాక్టర్ విజయేందర్‌రెడ్డి, తదితరులు మాట్లాడారు.
