రామాయణ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నది అగ్ర కథానాయిక సాయిపల్లవి. రణబీర్‌కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారి దర్శకుడు. ఈ సినిమాలో సీత పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నానని సాయిపల్లవి ఆనందం వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి రామాయణం వింటూ పెరిగాను. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నాలోని భయాలన్నింటిని పక్కనబెట్టి సీత పాత్ర కోసం సన్నద్ధమవుతున్నా. ఓ నటిగా కాకుండా భక్తురాలిలా సీత పాత్రలో నటిస్తున్నా. నా కెరీర్‌లో ఇదొక అపురూపమైన చిత్రంగా నిలిచిపోతుంది అని చెప్పింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)