గాజాలోని పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా చిన్నారులకు శ్మశాన వాటికలా మారుతోందన్నారు. గాజా పరిస్థితి మానవతా సంక్షోభం కంటే ఎక్కువ అని, ఇది మానవత్వం సంక్షోభమన్నారు. కాల్పుల విరమణ అవసరమని, ప్రతి గంటకు మరింత అత్యవసరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం గాజాలో అమానవీయ ఘటనలను ఆపాలని, అలాగే మానవతా సహాయాన్ని విస్తరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూఎన్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న 89 మంది మరణించారని యూఎన్ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.