ఇజ్రాయెల్`హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో గత మూడు రోజులు రెండువర్గాలు తమ చెరవలో ఉన్న బందీలను విడుదల చేశాయి. నేటితో నాలుగు రోజుల సంధి గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఈ ఒప్పందం పొడిగింపునకు అనుకూలంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు చేశారు. దానివల్ల మరింతమంది బందీలు విడుదలయ్యే వీలు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పులు విరమణ ఒప్పందంతో హమాస్ 58 మందిని విడిచిపెట్టగా, ఇజ్రాయెల్ 114 మందికి విముక్తి కల్పించింది. వీరిలో నాలుగేళ్ల అమెరికా బాలిక కూడా ఉంది. ఈ డీల్ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. గాజాకు అత్యంత అవసరమైన మానవతా సాయం అందుతోంది. ఈ ఫలితాలను ఇలాగే పొందేందుకు దీనిని పొడిగించవచ్చు. అదే నా లక్ష్యం. మనందరి లక్ష్యం అదే అని బైడెన్ అన్నారు.
