భారత్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు గత వారం కెనడాలో హత్యకు గురైనట్టు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ఒట్టావాలోని భారత హై కమిషన్, టొరంటో, వాంకోవర్లలోని మన దౌత్యవేత్తలు నిరంతరం బాధిత కుటుంబాలతో సంప్రదింపుల్లో ఉండి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నారని ఆయన తెలిపారు. మృతులలో 20 ఏండ్ల హర్షన్‌దీప్ సింగ్‌ను మాత్రమే గుర్తించారని, మిగిలిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. కెనడాలో పౌరులు, విద్యార్థుల భద్రత, సంక్షే మం చాలా ముఖ్యమైనదని, అందరూ అప్రమ త్తంగా ఉండాలని ఆయన కోరారు.