నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన చిత్రం డాకు మహారాజ్. దర్శకుడు బాబీ కొల్లి. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు బాబీ మాట్లాడారు. డాకు మహారాజ్ రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నా. బాలయ్యగారి అభిమానులకు ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇవ్వాలనేది నిర్మాత నాగవంశీ కల. అందుకు తగ్గట్టే సినిమా తీశాం. ఇందులో అయిదు యాక్షన్ సీక్వెన్సులుంటాయి. ప్రతి సీక్వెన్స్ అభిమానులకు హై ఇస్తుంది. వినోదంతోపాటు, హత్తుకునే ఎమోషన్స్ కూడా ఇందులో ఉంటాయి అని అన్నారు.
డాకు మహారాజ్ ను రెండు తెలుగు రాష్ర్టాల్లో కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. యూఎస్‌లోనూ భారీస్థాయిలోనే విడుదల ఉంటుంది. అక్కడ బుకింగ్స్ కూడా బావున్నాయి. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ నెల 12నే సినిమా విడుదల కానుంది. సినిమా చూసి చెబుతున్నా డాకు మహారాజ్ అస్సలు నిరాశ పరచదు అని నిర్మాత నాగవంశీ నమ్మకం వెలిబుచ్చారు.