హీరో కార్తి తన 25వ చిత్రం జపాన్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జివి ప్రకాష్ కుమార్ జపాన్ కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని కంపోజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
కార్తీ ఇప్పుడు ఏకంగా పాటే పాడేశారు. జపాన్ సినిమాలో టచ్చింగ్ టచ్చింగ్ అంటూ జి.వి.ప్రకాశ్‌కుమార్ స్వరపరిచిన పాటను ఇంద్రావతి చౌహాన్‌తో కలిసి పాడేశారు కార్తీ. కార్తీ వాయిస్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్ అన్నారు.మాస్ మెచ్చే విధంగా భాస్కరభట్ల రచించిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు రాజు మురుగన్ చెప్పారు. జపాన్ కథ, కార్తీ గెటప్, ఆయన మేనరిజమ్స్, అను ఇమ్మాన్యుయేల్‌తో కార్తీ కెమిస్ట్రీ ఇవన్నీ సినిమాను ప్రధానబలాలని ఆయన అన్నారు. కేఎస్.రవికుమార్, సునీల్, విజయ్ మిల్టన్ ప్రత్యేకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా ఎస్.రవివర్మన్. నిర్మాతలు ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు.