
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచలనమే. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్, తన పాలన ఎలా ఉంటుందో మరోసారి ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. అక్రమ వలసదారులను స్వదేశాలకు సాగనంపిన ట్రంప్, ఇప్పుడు విదేశాలకు చెందిన రాయబారులపై బహిష్కరణ వేటు వేస్తున్నారు.

యూఎస్‌లోని దక్షిణాఫ్రికా కు చెందిన రాయబారి ఇబ్రహీం రసూల్ పై ట్రంప్ సర్కార్ తాజాగా వేటు వేసింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్ ఈ గొప్ప దేశంలో ఉండేందుకు ఆహ్వానించదగిన వ్యక్తి కాదు అని అన్నారు. ఆయన అధ్యక్షుడు ట్రంప్‌ను ద్వేషించే వ్యక్తి అని, ఒక జాతి విద్వేష రాజకీయ నాయకుడు అని, దీనిపై ఆయనతో చర్చించాల్సింది ఏమీ లేదు అని రూబియో పేర్కొన్నారు.
