అమెరికాను మళ్లీ ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రతి రోజు ఒక్కొక్క దేశానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్‌పై పడింది. ఇది 600కుపైగా సంవత్సరాలుగా డెన్మార్క్‌లో భాగంగా ఉంది. ట్రంప్ స్పందిస్తూ.. దేశ భద్రత, ప్రపంచ స్వేచ్ఛ కోసం గ్రీన్‌లాండ్‌పై యాజమాన్యం, నియంత్రణ కచ్చితంగా ఉండాలని అమెరికా భావిస్తున్నదని పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌పై నియంత్రణ కావాలనే కోరికను ఆయన తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలోనే వ్యక్తం చేశారు.