టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతుగా ఎన్నారై టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. టీడీపీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కో ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు షేక్ బాషా, అద్దేపల్లి చిన్నరాజు, కుటుంబరావు, కోడూరు రమేశ్ గౌడ్, గుణపాటి చిన్నబాబు, హరికృష్ణ తదితరులు కువైట్‌లోని వివిధ పార్కులకు వచ్చిన తెలుగువారిని కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోలో పేర్కొన్న పథకాలను వివరించారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసేలా భారత్‌లో ఉంటున్న వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు అవగాహన కల్పించాని కోరారు.
కువైట్‌లోని వివిధ సంస్థల్లో పని చేస్తున్న పలువురు ఉద్యోగులను కుదరవల్లి సుధాకరావు కలిశారు. ఈ సందర్భంగా కుదరవల్లి సుధాకర్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితిని వివరిస్తూ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ప్రజల ఆస్తులకు రక్షణ ఉంటుందని, రాష్ట్రానికి రాజధాని ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం, ఇసుక మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, వాటి నుంచి బయటపడాలంటే చంద్రబాబు సీఎం కావాలని వివరించారు. ఎన్నికల రోజు ( మే 13) వరకు కువైట్‌లో తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో పర్యటిస్తామని ఈ సందర్భంగా సుధాకర్‌రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే వారి బంధువులు, స్నేహితులకు అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.