Namaste NRI

కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలపై  ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కొంకణ్‌లో జన్‌ఆశీర్వాద్‌ ర్యాలీలో పాల్గొన్న రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది ముందే గ్రహించిన రత్నగిరి కోర్టు, బాంబే హైకోర్టులకు  నారాయణ్‌ రాణే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా అది రద్దయ్యింది. బెయిల్‌ పిటిషన్‌ రద్దయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. దీంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

                తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాలన్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. దేశానికి ఏ ఏడాది స్వాతంత్రయం వచ్చిందో తెలియని ఉద్ధవ్‌ ఠాక్రేపై తాను చెంప దెబ్బ కొట్టేవాడినని ఓ ర్యాలీలో అన్నారు కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణె. దీనిపై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదులు చేసింది. బీజేపీ కార్యాలయాలపై శివసేన కార్యకర్తలు దాడులు కూడా చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events