పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే తొలి పీరియాడియల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ కథానాయిక. స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనేది ఉపశీర్షిక. క్రిష్ దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకు ప్రస్తుత దర్శకుడు జ్యోతికృష్ణ. ఇటీవలే భారీ యాక్షన్ సన్నివేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన తెరకెక్కించారు. హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ నేతృత్వంలో ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీక రణ జరిగింది. పవన్‌కల్యాణ్‌తోపాటు 500మంది ఫైటర్లు పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం అద్భుతంగా వచ్చిందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారాంతం విజయవాడలో ఆఖరి షెడ్యూల్ మొదలుకానున్నదని, పవన్‌కల్యాణ్‌తోపాటు రెండొందలమంది ఆర్టిస్టులు ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నా రని, అత్యంత కీలకమైన భారీ సన్నివేశాల చిత్రీకరణ ఈ షెడ్యూల్‌లో ఉంటుందని, దీంతో హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అవుతుందని మేకర్స్ తెలిపారు.
వచ్చే ఏడాది మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుపమ్‌ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కళ: తోట తరణి, నిర్మాత: ఎ.దయాకర్‌రావు, సమర్పణ: ఏ.ఎం.రత్నం, నిర్మాణం: శ్రీసూర్య మూవీస్.