వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్‌రావిపూడి దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో నాయకానాయికలు వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్యరాజేష్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ సినిమాలో వెంకటేష్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. క్రైమ్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకునే చిత్రమిదని, సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందని చిత్రబృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేష్, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.