వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న సినిమా చారి 111. టీజీ కీర్తికుమార్ దర్శకుడు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషిస్తు న్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కన్‌ఫ్యూజ్ అయ్యే గూఢచారిగా వెన్నెల కిశోర్‌ను చూపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమా తీశామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా పరిష్కరించా డనేదే సినిమా అని దర్శకుడు కీర్తి కుమార్ చెప్పారు. స్పై జానర్ సినిమాల్లో చారి 111 కొత్తగా ఉంటుంది అని నిర్మాత అదితి సోనీ తెలిపారు. ఈ జనరేషన్ కమెడియన్లలో తనకంటూ ప్రత్యేకమైన ైస్టెల్ క్రియేట్ చేసుకు న్న ఆయన ఈ సినిమాలో ఎలా నవ్విస్తాడో చూడాలంటే మార్చి 1న థియేటర్ల విడుదలయ్యే వరకు ఆగాల్సిం దే. ఈ సినిమాకు కెమెరా: కషిష్ గ్రోవర్, సంగీతం: సైమన్ కె కింగ్.