రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వేట్టయాన్-ది హంటర్. టీజే జ్ఞానవేల్ రాజా దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, రితికాసింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు నటిస్తున్నారు. బుధవారం ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్‌ను పోలీస్ డిపార్ట్మెంట్లోనే పేరుపొందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా చూపించారు. మనకు ఎస్పీ పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు అంటూ నేరస్థులంతా వేట్టయాన్‌ను చూసి హడలిపోతుంటారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-86.jpg)
అసాంఘిక శక్తుల ఆటకట్టించే పవర్ఫుల్ పోలీస్‌గా రజనీకాంత్ నటన ఆకట్టుకుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వేట్టయాన్ జీవితంలో తెలియని కోణాలేమిటి? అతను ఏ లక్ష్యం కోసం బయలుదేరాడు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-85.jpg)