ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఆయన సతీసమేతంగా తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించారు. జలకళ ఉట్టిపడుతున్న తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించే క్రమంలో ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అంతకుముందు తన సతీమణి ఉషతో కలిసి వెంకయ్య నాయుడు ప్రత్యేక విమానంలో హుబ్బల్లి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్‌లో హోస్పేట చేరుకుని, రోడ్డుమార్గం ద్వారా తుంగభద్ర డ్యామ్ వద్దకు వచ్చారు. ఉపరాష్ట్రపతి హెలికాప్టర్ లోంచి తుంగభద్ర అందాలను వీడియోలో బంధించి, ఆ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు.